: మాధురి దీక్షిత్ ను ప్రశంసించిన ప్రధాని
ప్రధాని నరేంద్ర మోదీ దేశాభివృద్ధి కోసం అనేక పథకాలను అమలుచేస్తున్నారు. తాజాగా ఆయన పానిపట్ లో 'బేటీ బచావో-బేడీ పఢావో' పథకాన్ని నేడు ప్రారంభించారు. కాగా, ప్రారంభోత్సవ కార్యక్రమానికి బాలీవుడ్ సీనియర్ బ్యూటీ మాధురీ దీక్షిత్ కూడా హాజరైంది. తల్లికి అనారోగ్యంగా ఉన్నా, మాధురి ఈ కార్యక్రమానికి హాజరవడం ప్రధాని మోదీని ఆకట్టుకుంది. దీంతో, ఆమెను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. "మాధురి గారు కూడా మాతో ఉన్నారు. తల్లికి అనారోగ్యంగా ఉన్నా పానిపట్ వచ్చారు. స్త్రీ శిశువులను కాపాడాలంటూ ఘనమైన సందేశాన్నిచ్చారు" అని పేర్కొన్నారు. దేశంలో లింగ వివక్ష నిర్మూలనే లక్ష్యంగా కేంద్రం 'బేటీ బచావో-బేటీ పఢావో' పథకాన్ని తెరపైకి తెచ్చింది.