: పులుల సంఖ్య పెరగడంపై అమితాబ్ స్పందన


దేశంలో పులుల సంఖ్య గణనీయంగా పెరిగినట్టు నివేదికలు వెల్లడించిన నేపథ్యంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ (72) సంతోషం వ్యక్తం చేశారు. అమితాబ్ 'సేవ్ ద టైగర్' క్యాంపెయిన్ కు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. 2010 నుంచి అమితాబ్ ఈ ప్రచారంలో పాల్గొంటున్నారు. గత రెండేళ్లలో దేశంలో పులుల సంఖ్య 1411 నుంచి 2226 వరకు పెరిగినట్టు సర్వేలో తేలింది. నేడు ఎంతో ఆనందంగా ఉందంటూ ఆయన తన బ్లాగులో పోస్టు పెట్టారు.

  • Loading...

More Telugu News