: ఆస్ట్రేలియన్ ఓపెన్ లో మహేశ్ భూపతికి చుక్కెదురు
భారత టెన్నిస్ స్టార్ మహేశ్ భూపతికి ఆస్ట్రేలియన్ ఓపెన్ లో చుక్కెదురైంది. పురుషుల డబుల్స్ విభాగంలో భూపతి-జుర్గెన్ మెల్జెర్ (ఆస్ట్రియా) జోడీ తొలి రౌండ్ లోనే పరాజయం పాలైంది. భూపతి జోడీ 4-6, 3-6తో అర్జెంటీనా ద్వయం డీగో ష్వార్జ్ మన్-హొరాసియో జెబల్లోస్ పై ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ లో ఏ దశలోనూ భూపతి-మెల్జెర్ జంట కోలుకున్నట్టు కనిపించలేదు. మొత్తం 27 తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. ఇక, భారత్ కు చెందిన మరో డబుల్స్ ఆటగాడు రోహన్ బోపన్న ముందంజ వేశాడు. బోపన్న-డానియెల్ నెస్టర్ (కెనడా) జోడీ తొలి రౌండ్ పోటీలో 7-6 (2), 7-5తో మార్కస్ బఘ్దాటిస్ (సైప్రస్)-మారింకో మటోసెవిక్ (ఆస్ట్రేలియా) ద్వయంపై నెగ్గింది. ఈ మ్యాచ్ లో బోపన్న జోడీకి 9 సర్వీస్ బ్రేక్ అవకాశాలు లభించగా, వాటిలో మూడింటిని మాత్రమే పాయింట్లుగా మలుచుకుంది.