: తిరుపతి ఉపఎన్నికపై రఘువీరాకు టీడీపీ నేతల ఫోన్


తిరుపతి ఉప ఎన్నిక ఏకగ్రీవమయ్యేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఆ పార్టీ నేతలు ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డికి ఫోన్ చేశారట. కాంగ్రెస్ పార్టీ తరపున అభ్యర్థిని నిలబెట్టవద్దంటూ వారు రఘువీరాకు విజ్ఞప్తి చేసినట్టు సమాచారం. దీనిపై ఆయన సానుకూలంగానే స్పందించారట. పార్టీలో చర్చించి ఈ సాయంత్రం నిర్ణయం చెబుతామని రఘువీరా టీడీపీ నేతలకు హామీ ఇచ్చినట్టు తెలిసింది. కాగా, ఫిబ్రవరి 13న పోలింగ్ జరగనుంది. ఇక, తిరుపతిలో తాము అభ్యర్థిని నిలబెట్టడం లేదంటూ వైఎస్సార్సీపీ స్పష్టం చేసింది. తిరుపతి టీడీపీ ఎమ్మెల్యే వెంకటరమణ అనారోగ్యంతో మృతి చెందడంతో అక్కడ ఉప ఎన్నికలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ వెంకటరమణ సతీమణిని బరిలో నిలిపింది.

  • Loading...

More Telugu News