: లోకేష్ ను రాజ్యాంగేతర శక్తిగా మలిచే బదులు, ఇదే మేలు!: సి.రామచంద్రయ్య
టీడీపీ యువనేత నారా లోకేష్ ఏ హోదాలో మంత్రులతో సమీక్షలు నిర్వహిస్తున్నారని ఏపీ శాసనమండలిలో విపక్ష నేత సి.రామచంద్రయ్య ప్రశ్నించారు. ఏ సభలోనూ సభ్యుడు కానటువంటి నారాయణకు మంత్రి పదవి ఇచ్చినట్టే... లోకేష్ కు పదవి ఇవ్వాల్సిందని ఎద్దేవా చేశారు. లోకేష్ ను రాజ్యాంగేతర శక్తిగా మలిచే బదులు, ఇదే మేలని చెప్పారు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థా? లేక ఆటవిక వ్యవస్థా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎవరి చేతిలోనో బందీ అయినట్టు కనబడుతోందని అన్నారు.