: బీసీసీఐని సంస్కరించేందుకు ముగ్గురు సభ్యుల కమిటీ


భారతీయ క్రికెట్ బోర్డును సంస్కరించేందుకు సర్వోన్నత న్యాయస్థానం చర్యలు తీసుకుంది. ఈ మేరకు బీసీసీఐ సంస్కరణలు, సవరణల కోసం ముగ్గురు సభ్యులతో కూడిన ఒక కమిటీని సుప్రీం వేసింది. అందులో మాజీ న్యాయమూర్తులు ఆర్ఎం లోథా, రవీంద్రన్, అశోక్ బాన్ లు సభ్యులుగా ఉంటారు. గురునాథ్ మెయ్యప్పన్ కు ఎలాంటి శిక్ష విధించాలన్న నిర్ణయాన్ని వారికే అప్పగించింది. ఇక ఐపీఎల్ సీఓఓ సుందర్ రామన్ కు వ్యతిరేకంగా వచ్చిన ఆరోపణలపై మరింత దర్యాప్తు అవసరమని పేర్కొంది. అటు బీసీసీఐలో బాధ్యతలు నిర్వహిస్తున్న వారికి ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఉండకూడదని న్యాయస్థానం అభిప్రాయపడింది.

  • Loading...

More Telugu News