: బుచ్చవ్వ సత్తెకాలపుదే... కానీ ఆదర్శనీయం!


తన కుమారుడు ప్రభుత్వ ఉద్యోగి అయినందున తనకు పింఛన్ తో పని లేదని సత్తెకాలపు బుచ్చవ్వ ఎంపీడీవోను కలిసి వాపస్ తీసుకోమని విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వ పథకాల్లో భాగంగా రూపాయి వచ్చినా ఫర్వాలేదని భావిస్తున్న ప్రస్తుత తరుణంలో మెదక్ జిల్లా సిద్దిపేట మండలం పొన్నాల గ్రామ పంచాయతీ మధిర కిష్టసాగర్‌కు చెందిన లక్కర్సు బుచ్చవ్వకు 200 పింఛన్ అందేది. అది ప్రస్తుతం వెయ్యికి చేరింది. గత మూడు నెలల పింఛన్ గా 3 వేల రూపాయలు అందించారు. దానిని తిరస్కరించిన ఆమె, పింఛన్‌ రద్దు చేయాలని కోరుతూ పింఛన్ కార్డును ఎంపీడీఓకి అందించింది. దీనిపై ఎంపీడీవో మాట్లాడుతూ, తనకు ఇద్దరు కుమారులు ఉన్నారని, వారిలో పెద్ద కుమారుడు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాడని పింఛన్ వద్దని సూచించి బుచ్చవ్వ అందరికీ ఆదర్శంగా నిలిచిందని అన్నారు. అనర్హులు పింఛన్ కావాలని కోరుకుంటున్న ఈ తరుణంలో ఆమె అందరికీ ఆదర్శమని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News