: షర్మిల యాత్రను అడ్డుకునేందుకు యత్నించిన టీఆర్ఎస్ శ్రేణులు
నల్లగొండ జిల్లాలో వైకాపా అధినేత జగన్ సోదరి షర్మిల యాత్ర చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ రోజు ఆమె చేస్తున్న యాత్రను కొందరు టీఆర్ఎస్ మద్దతుదారులు అడ్డుకోవడానికి యత్నించారు. నాగార్జునసాగర్ హిల్ కాలనీ వద్ద ఆమె పర్యటిస్తున్నప్పుడు ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే, పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని టీఆర్ఎస్ కార్యకర్తలను చెదరగొట్టారు. దీంతో, షర్మిల యాత్ర కొనసాగింది. సాగర్ కుడి గట్టు కాల్వ వద్ద తెలంగాణ ఇరిగేషన్ శాఖ అధికారిని మాచర్ల ప్రాంత టీడీపీ, వైకాపా కార్యకర్తలు అడ్డుకున్న నేపథ్యంలో, ఈ ఘటన జరిగి ఉంటుందని భావిస్తున్నారు.