: క్విడ్ ప్రోకో బదులుగా భూమి కట్టబెడతారా?: రాఘవులు


వైఎస్ హయాంలో జరిగిన క్విడ్ ప్రోకో స్థానంలో రియల్ దందా సాగుతున్నట్టు అనుమానం కలుగుతోందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ఆరోపించారు. సీపీఎం కేంద్ర కమిటీ మూడు రోజుల సమావేశాలు ముగిసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏపీ రాజధాని కోసం 30వేల ఎకరాల భూమి అవసరం లేదని అన్నారు. ఎనిమిది చదరపు కిలోమీటర్ల పరిధిలో రాజధాని నిర్మాణం జరుగుతుందని సీఎం చెబుతున్నారని, ఆ లెక్కన 1,561 ఎకరాలు సరిపోతాయని ఆయన స్పష్టం చేశారు. సింగపూర్, జపాన్ దేశాలకు వత్తాసు పలుకుతున్న పారిశ్రామిక వేత్తలకు క్విడ్ ప్రోకోకు బదులుగా రియల్టర్లకు భూములు కట్టబెట్టేందుకు భూమి సేకరిస్తున్నారా? అని ఆయన ప్రశ్నించారు. భూ సేకరణకు తమ పార్టీ వ్యతిరేకమని చెప్పిన ఆయన, భూసేకరణ చట్టప్రకారం జరగాలని సూచించారు. నిరంకుశ పద్ధతిలో భూములు లాక్కుంటే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు. గతంలో తాను అధికారంలో ఉండగా 1.3 శాతం జనాభాను అరికట్టానని, అందుకు ప్రపంచ బ్యాంకు కూడా తనను అభినందించిందని చెప్పుకున్న బాబుకు ముందు చూపు పోయి వెనక చూపు వచ్చినట్టుందని, అందుకే ఎక్కువ మంది పిల్లల్ని కనాలని పిలుపునిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News