: మోదీ భారతీయతకు చిహ్నమని ఎప్పుడూ అనలేదు: జనార్ధన్ ద్వివేది
ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తాను ప్రశంసించినట్టు వచ్చిన వార్తలపై కాంగ్రెస్ నేత జనార్ధన్ ద్వివేది స్పందించారు. మోదీ భారతీయతకు చిహ్నమని ద్వివేది అన్నట్టు మీడియాలో వార్తలొచ్చాయి. దీంతో, కాంగ్రెస్ పార్టీ ఆయన వ్యాఖ్యలను ఖండించింది. అంతేగాదు, క్రమశిక్షణ చర్యలుంటాయన్న సంకేతాలు కూడా వెలువరించింది. అయితే, తాను ఆ వ్యాఖ్యలు చేయలేదని ద్వివేది అంటున్నారు. భారతీయతకు మోదీ చిహ్నమని ఎవరన్నారంటూ ప్రశ్నించారు. ఆ మాటలు తాను అనలేదని స్పష్టం చేశారు. కాగా, రెడిఫ్.కామ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ద్వివేది ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది.