: ఇవేం చికిత్సలు... గాంధీ ఆస్పత్రిలో స్వైన్ ఫ్లూ చికిత్సలపై కేంద్ర బృందం మండిపాటు


తెలంగాణలో శరవేగంగా వ్యాపిస్తున్న స్వైన్ ఫ్లూ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై కేంద్ర బృందం అసంతృప్తి వ్యక్తం చేసింది. నేటి ఉదయం ఢిల్లీ నుంచి వచ్చిన ముగ్గురు సభ్యుల బృందం గాంధీ ఆస్పత్రిని సందర్శించింది. ఈ సందర్భంగా ఆస్పత్రి మొత్తం చుట్టేసిన బృందం సభ్యులు... ఆస్పత్రిలో సౌకర్యాలు, స్వైన్ ఫ్లూ బాధితులకు అందుతున్న చికిత్సపై ఆగ్రహం వ్యక్తం చేశారట. అసలు ఇవేం చికిత్సలు, మృతుల వివరాలేమి, రికార్డులను ఇలాగేనా నిర్వహించేది? అంటూ అక్కడికక్కడే గాంధీ వైద్యాధికారులను కేంద్ర బృందం సభ్యులు నిలదీసినట్లు సమాచారం. కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ సమక్షంలోనే ఆస్పత్రిలో అపరిశుభ్ర పరిస్థితులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర రాజధానిలోని ఆస్పత్రుల్లోనే పరిస్థితి ఇలా ఉంటే, ఇక జిల్లాల్లోని ఆస్పత్రుల పరిస్థితి ఏమిటని తమ వెంట వచ్చిన తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖాధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారట. కేంద్ర బృందం అసంతృప్తి నేపథ్యంలో ఎలా స్పందించాలో తెలియక తెలంగాణ అధికారులు నీళ్లు నమిలారట.

  • Loading...

More Telugu News