: హైదరాబాదీలను అలరించనున్న జాకీర్ హుస్సేన్, హరిహరన్
ప్రముఖ గాయకుడు హరిహరన్, ప్రముఖ తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ హైదరాబాదీలను అలరించనున్నారు. మాదాపూర్ లోని సైబర్ సిటీ కన్వెన్షన్ సెంటర్ లో ఈ నెల 24న జరగనున్న ఓ కార్యక్రమంలో తమ సంగీత ప్రతిభను వీరు ప్రదర్శించనున్నారు. తాజాగా వారు విడుదల చేసిన 'హాజిర్ 2' ఆల్బమ్ పాటలను అభిమానులకు వినిపించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన లోగోను ఆవిష్కరించిన సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు మాట్లాడుతూ, ఒకే వేదికపైకి దిగ్గజాలను చేర్చి, హైదరాబాదీలను అలరించనున్నామని అన్నారు. ఈ కార్యక్రమానికి మంచి ఆదరణ లభిస్తుందని వారు ఆశిస్తున్నారు. కాగా, హరిహరన్, జాకీర్ హుస్సేన్ లకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్న విషయం తెలిసిందే.