: తెలంగాణ కాంగ్రెస్ నేతలతో డిగ్గీరాజా భేటీ


తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రయోజనాన్ని తన ఖాతాలో వేసుకోవాలని భావించిన కాంగ్రెస్ పార్టీ ఊహించని విధంగా మట్టికరచింది. అయితే, పరాజయాల నుంచి తేరుకున్న కాంగ్రెస్ పార్టీ, బలోపేతంపై దృష్టి సారించింది. దీంతో తెలంగాణలో పార్టీని పటిష్టం చేసేందుకు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్ సింగ్ నడుం బిగించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, పార్టీని పటిష్టం చేసేందుకు చేపట్టే చర్యలపై పార్టీ సీనియర్ నాయకులతో గాంధీ భవన్ లో చర్చించనున్నారు. కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తీసుకొచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలను ఆయన వారిని అడిగి తెలుసుకోనున్నారు. ఈ రోజంతా వారితో గ్రూపులుగా భేటీలు నిర్వహించి పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News