: ఒబమా వార్నింగ్ ఎఫెక్ట్... జమాత్ ఉద్ దవాపై పాక్ నిషేధం


భారత్ లో తాను జరపనున్న మూడు రోజుల పర్యటన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పాకిస్థాన్ కు వార్నింగ్ ఇచ్చారు. తానుండగా భారత్ లో ఉగ్రదాడి జరిగి, దాని వెనుక పాక్ హస్తముందని తేలితే తీవ్రపరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. దీంతో నష్టనివారణ చర్యలు ప్రారంభించిన పాకిస్థాన్ ప్రభుత్వం, భారత్ లో ఉగ్రదాడికి దిగి ఉనికి చాటుకోవాలని భావిస్తున్న జమాత్ ఉద్ దవాపై నిషేధం విధించింది. ఇలా నిషేధం విధించడం ద్వారా పాక్ వ్యూహాత్మక ఎత్తుగడ వేసింది. భారత నిఘా సంస్థలు హెచ్చిరిస్తున్నట్టు ఉగ్రదాడి జరిగితే తనకు సంబంధం లేనట్టు పాక్ చేతులు దులుపుకునే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. ఉగ్రవాద సంస్థ జమాత్ ఉద్ దవాకు చీఫ్ గా 26/11 దాడుల ప్రధాన నిందితుడు హఫీజ్ సయీద్ ఉన్నారు. అమెరికా అధ్యక్షుడి పర్యటనలో దాడి చేస్తే ఎక్కువ ప్రభావముంటుందని హఫీజ్ ఆలోచనగా ఉందని నిఘా సంస్థలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఒబామా చేసిన హెచ్చరికతో పాక్ నిషేధం పేరిట సరికొత్త ఎత్తుగడ వేసినట్లుగా తెలుస్తోంది.

  • Loading...

More Telugu News