: సౌరవ్ గంగూలీ బీజేపీలో చేరే అవకాశం!
టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయనతో బీజేపీ అధిష్ఠానం చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. చర్చలు సఫలమైతే గంగూలీ బీజేపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. భారతీయ క్రికెట్ ప్రముఖుల్లో ఒకరైన గంగూలీకీ భారీ అభిమానగణం ఉంది. ప్రత్యేకంగా బెంగాల్లో ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. కొంతకాలం నుంచి ఆయన రాజకీయాల్లోకి వస్తారని వార్తలు వస్తున్నప్పటికీ దాదా ఖండిస్తూ వచ్చాడు. రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదని కూడా స్పష్టం చేశాడు. గతేడాది సార్వత్రిక ఎన్నికల్లో అయితే బీజేపీ ఇచ్చిన ఎంపీ సీటును సౌరవ్ సున్నితంగా తిరస్కరించాడు. మరి, ఈసారి గంగూలీ ఏమంటాడో చూడాలి!