: ఆంధ్ర బ్యాంక్ ఉద్యోగుల వినూత్న నిరసన... బకాయిలు చెల్లించని నిమ్మగడ్డ రామకృష్ణ ఇంటి ముందు నిరసన
రోజురోజుకూ పెరిగిపోతున్న మొండి బకాయిలను ఎలాగైనా వసూలు చేయాలన్న ఉద్దేశంతో ఆంధ్ర బ్యాంక్ ఉద్యోగులు వినూత్న నిరసన చేపట్టారు. భారీ మొత్తంలో రుణాలు తీసుకుని వాటిని తిరిగి చెల్లించడంలో అలసత్వం ప్రదర్శిస్తున్న వారి ఇంటి ముందు ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు. నేటి ఉదయం విజయవాడ, వరంగల్ తదితర పట్టణాల్లో రాజకీయ నేతలు, వ్యాపారుల ఇళ్ళ ముందుకు వెళ్లి బకాయిలు చెల్లించాలని మౌన ప్రదర్శన చేశారు. విజయవాడకు చెందిన వీనస్ ఆక్వా లిమిటెడ్ యజమాని నిమ్మగడ్డ రామకృష్ణ ఇంటి ముందు నిరసన తెలిపారు. రామకృష్ణ సంస్థ బ్యాంకుకు రూ.21 కోట్లు బకాయి పడినట్టు తెలుస్తోంది.