: ఐక్యరాజ్యసమితి ఆరు మండలాలను దత్తత తీసుకుంది: కోడెల
గుంటూరు జిల్లాలోని ఆరు మండలాలను ఐక్యరాజ్యసమితి, ప్రపంచ బ్యాంకు దత్తత తీసుకున్నాయని శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ తెలిపారు. గుంటూరులో ఆయన మాట్లాడుతూ... ఐక్యరాజ్యసమితి, ప్రపంచ బ్యాంకులు దత్తత తీసుకున్న ఆరు మండలాల్లో పౌష్టికాహారం, మరుగుదొడ్లు, స్వచ్ఛభారత్ వంటి కార్యక్రమాల్లో ప్రభుత్వానికి సహకరిస్తాయన్నారు. ఆరు మండలాల్లో మెరుగైన మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తామని ఆయన తెలిపారు.