: 'బేటీ బచావో బేటీ పడావో' అంబాసిడర్ గా మాధురీ దీక్షిత్
కేంద్ర ప్రభుత్వ తాజా పథకం 'బేటీ బచావో... బేటీ పడావో' ప్రచార అంబాసిడర్ గా బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ ఎంపికైంది. ఈ మేరకు మాధురీ, తన ట్విట్టర్ లో ఈ విషయాన్ని వెల్లడించి, సంతోషాన్ని వ్యక్తం చేసింది. నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమాన్ని హర్యానాలో లాంఛనంగా ప్రారంభించనున్నారు. శిశువుల లింగ నిష్పత్తి మెరుగుపరచడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకం శ్రీకారం చుడుతోంది. మహిళా శిశు సంక్షేమం, మానవవనరుల అభివృద్ధి, ఆరోగ్య మంత్రిత్వ శాఖలు ఉమ్మడిగా ఈ పథకాన్ని నిర్వహించనున్నాయి. తొలిదశలో ఎంపిక చేసిన వంద జిల్లాల్లో ఈ పథకం అమలు కానుంది.