: మరో మైలురాయి దిశగా సెన్సెక్స్... వరుసగా మూడో రోజూ ఆల్ టైం రికార్డు


భారత స్టాక్ మార్కెట్ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతోంది. వరుసగా ఆరో రోజు కూడా సెన్సెక్స్, నిఫ్టీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ తొలిసారిగా 29 వేల మార్కు దాటి 30 వేల దిశగా సాగుతోంది. ఉదయం 10:30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 147 పాయింట్లకు పైగా లాభంలో కొనసాగుతుండగా, నిఫ్టీ 40 పాయింట్లకు పైగా లాభంలో ట్రేడవుతోంది. ట్రేడింగ్ ప్రారంభంలోనే నిఫ్టీ 8,700 మార్కు దాటింది. నిన్న స్టాక్ మార్కెట్లు కొత్త రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. సెన్సెక్స్, నిఫ్టీలు ఇంట్రాడే ట్రేడింగ్‌ లో జీవితకాల గరిష్ట స్థాయులను తాకి, కొత్త గరిష్ట స్థాయుల వద్ద ముగిశాయి. నేడు సైతం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు ఉత్సాహంగా ఈక్విటీలు కొనుగోలు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News