: స్వైన్ ఫ్లూ సోకుతుందని భయపడుతున్నారా? ఇలా చేయండి, మీ దరి చేరదు!


తెలంగాణ రాష్ట్రాన్ని వణికిస్తున్న స్వైన్ ఫ్లూ మహమ్మారి బారినుంచి తప్పించుకోవడం ఎలా అని భయపడుతున్నారా? అదేమంత పెద్ద విషయం కాదని, అసలు స్వైన్ ఫ్లూ ఏమంత ప్రమాదకరమైన వ్యాధి కాదని ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులు, తెలంగాణ ముఖ్యమంత్రి భరోసా ఇస్తున్నారు. వారి భరోసా విషయం తెలియని స్వైన్ ఫ్లూ మాత్రం శరవేగంగా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో స్వైన్ ఫ్లూ బారినుంచి తప్పించుకోవడం ఎలా? అని జనం తలలు పట్టుకుంటున్నారు. మనం ఎప్పుడో వదిలేసిన ఆయుర్వేదంలో ఉన్న చిన్న చిట్కాను తాజాగా వైద్యులు సూచిస్తున్నారు. ప్రతి ఇంట్లోనూ ఉండే తులసి ఆకులు ఉదయాన్నే నోటిలో వేసుకుని నమిలితే స్వైన్ ఫ్లూ, ఎబోలా వంటి వ్యాధులు దరిచేరవని వారు చెబుతున్నారు. ఇంకా అనుమానం ఉంటే అడుగు పొడవున్న తిప్పతీగను తీసుకుని ఐదారు తులసి ఆకులతో కలిపి నీటిలో 20 నిమిషాలు మరిగించి రుచి కోసం నల్లమిరియాలు, సైంధవ లవణం, రాతి ఉప్పు, పటికబెల్లం కలుపుకుని గోరువెచ్చగా తాగితే మంచిదని, రోగనిరోధక శక్తి పెరుగుతుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. లేకుంటే రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు గోరువెచ్చటి నీటితో తిన్నా ప్రయోజనముంటుందని, గోరువెచ్చటి పాలలో చిటికెడు పసుపు కలుపుకుని తాగితే మంచిదని వారు సూచిస్తున్నారు. ఒకసారి స్వైన్ ఫ్లూ సోకినట్టు అనిపిస్తే వైద్యుల సలహా తీసుకోవడం మంచిదని వారు సలహా ఇస్తున్నారు.

  • Loading...

More Telugu News