: మరణానికి ముందు సునంద వింత ప్రవర్తన... ఇతరులను పరీక్షించేందుకు జార్జ్ బుష్, మన్మోహన్ సింగ్ లు వాడుకున్నారట!


ఆత్మహత్య చేసుకుందో లేక హత్య చేయబడిందో తెలియని సునందా పుష్కర్ మరణించడానికి కొద్ది రోజుల ముందు చాలా వింతగా ప్రవర్తించిందట. ఈ విషయాన్ని శశి, సునంద దంపతుల సన్నిహితుడు తేజ్ సరాఫ్ వెల్లడించారు. డిసెంబర్ 2013లో గోవాలోని తన భవంతిలో శశి, సునంద దంపతులకు తేజ్ కొంతకాలం ఆతిధ్యం ఇచ్చారు. ఆ సమయంలో ఆమె ఎంతో అశాంతితో ఉండేదని, గుప్పిళ్ళ కొద్దీ మాత్రలు మింగేదని, వింతగా మాట్లాడేదని ఆయన తెలిపారు. అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్, భారత ప్రధాని మన్మోహన్ సింగ్ లు వారి అవసరాలకు తనను వాడుకునేవారని, వారు తనతో తరచూ మాట్లాడేవారని తెలిపిందని ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తేజ్ వివరించారు. ఇతరులను పరీక్షించేందుకు వారు తన సహకారం కోరేవారని ఆమె తెలిపినట్టు ఆయన తెలిపారు. వారు గోవాలో ఉన్నప్పుడు రెండు సార్లు గొడవ పడ్డారని, ఆమె సరిగ్గా తిండి తినలేదని, నిద్ర కూడా పోదని, ఆమె పరిస్థితి తనకు అర్థం కాలేదని తెలిపారు. అన్ని మాత్రలు ఎందుకు అని ప్రశ్నిస్తే "సంవత్సరాల తరబడి నేను నిద్రపోలేదు. అందుకే అల్ ప్రాక్స్ తో పాటు పెయిన్ కిల్లర్ లను వాడుతున్నా" అని చెప్పినట్టు తేజ్ వివరించారు. కాగా, శశి, సునంద దంపతులు చివరిసారిగా కలిసి గోవా టూర్ కు వెళ్లారు. న్యూ ఇయర్ వేడుకల తరువాత వెనక్కు రాగా, ఆపై రెండు వారాల్లోనే సునంద హోటల్ గదిలో విగతజీవిగా కనిపించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News