: ఒబామాతో కలసి పాల్గొనే 'మన్ కీ బాత్' ప్రత్యేకమైనది!: ప్రదాని మోదీ


అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో కలసి పాల్గొననున్న 'మన్ కీ బాత్' కార్యక్రమంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నెల 27న నిర్వహించనున్న ఈ కార్యక్రమం ప్రత్యేకమైనదని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన నేటి ఉదయం తన ట్విట్టర్ ఖాతాలో ఈ వ్యాఖ్యలను పోస్ట్ చేశారు. ఒబామా తన భారత పర్యటనలో భాగంగా ఈ నెల 27న ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి మన్ కీ బాత్ కార్యక్రమంలో భారతీయులనుద్దేశించి ప్రసంగిస్తారు. ప్రధానిగా పదవి చేపట్టిన తర్వాత మారుమూల పల్లెలకు తన సందేశం వెళ్లాలన్న భావనతో మోదీ, మన్ కీ బాత్ కు శ్రీకారం చుట్టారు. ఇప్పటిదాకా ఆయన పలు అంశాలపై మన్ కీ బాత్ లో దేశ ప్రజలతో మాట్లాడారు. అమెరికాలో పర్యటించిన సందర్భంగా ఒబామాతో కలిసి ‘వాషింగ్టన్ పోస్ట్’కు ఎడిట్ కాలమ్ రాసిన మోదీ, మన్ కీ బాత్ లో పాల్గొనాలని ఒబామాను కోరారు. మోదీ అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన ఒబామా, ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News