: స్వైన్ ఫ్లూ కట్టడికి రంగంలోకి కేంద్రం... హైదరాబాదుకు నేడు కేంద్ర వైద్య బృందం!


తెలంగాణను వణికిస్తున్న స్వైన్ ఫ్లూ మహమ్మారిని కట్టడి చేసేందుకు కేంద్రం రంగంలోకి దిగనుంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ముగ్గురు వైద్యులతో కూడిన బృందం నేడు హైదరాబాదుకు రానుంది. నగరంలోని ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో వ్యాధి సోకి చికిత్స పొందుతున్న రోగులను పరిశీలించడంతో పాటు ఆస్పత్రుల వైద్యాధికారులతోను బేటీ కానుంది. అంతేకాక, మధ్యాహ్నం ఈ బృందం సభ్యులు తెలంగాణ సీఎం కేసీఆర్ తోనూ భేటీ అయ్యే అవకాశాలున్నాయి. రోజంతా హైదరాబాదులోనే ఉండే ఈ బృందం, వ్యాధి విస్తరణ, తాజా పరిస్థితి, వ్యాప్తి నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలు తదితరాలపై సమగ్ర నివేదికను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు అందించనుంది.

  • Loading...

More Telugu News