: విజ్ఞాన వనరుల్లో ఏపీ ఫస్ట్... పెట్టుబడులతో రండి: పారిశ్రామికవేత్తలకు చంద్రబాబు పిలుపు


విజ్ఞాన వనరులకు సంబంధించి భారత్ లో ఏపీనే తొలి స్థానంలో ఉందని, వాటిని సద్వినియోగం చేసుకునేందుకు పెట్టుబడులతో రావాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సమాఖ్య సదస్సులో భాగంగా ఆయన నిన్న వాల్ మార్ట్, పెప్పీకో, విప్రో తదితర సంస్థల అధిపతులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో అందుబాటులో ఉన్న వనరులపై ఆయన ఆయా సంస్థల అధిపతులకు వివరించారు. చంద్రబాబు వాదనలతో ఏకీభవించిన వాల్ మార్ట్, పెప్సీకో అధిపతులు సానుకూలంగా స్పందించారు. అంతేకాక పలు అంశాలకు సంబంధించి ఏపీ బ్రాండ్ కు దన్నుగా నిలిచేందుకు ఆ సంస్థలు సంసిద్ధత వ్యక్తం చేశాయి. త్వరలో ఏపీ పర్యటనకు రానున్నట్లు కూడా వారు వెల్లడించారు. ఇక పారిశ్రామికాభివృద్ధికి సంబంధించి ఏపీలో నమోదవుతున్న గణాంకాల పట్ల విప్రో అధినేత అజిమ్ ప్రేమ్ జీ, చంద్రబాబును ఆకాశానికెత్తేశారు. ఏపీలో తమ సంస్థను మరింత విస్తరించేందుకు ఆయన సుముఖత వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News