: తిరుగుబాటుదారుల అదుపులో యెమెన్ అధ్యక్షుడు


యెమెన్ అధ్యక్షుడు అబెద్ రబ్బొ మన్సూర్ ను షియా తిరుగుబాటుదారులు తమ బందీగా తీసుకున్నట్టు తెలుస్తోంది. యెమెన్ రాజధాని సనాలో ఆయనను అదుపులోకి తీసుకున్న తిరుగుబాటుదారులు, అధ్యక్ష భవనాన్ని కూడా తమ అధీనంలో ఉంచుకున్నట్టు సమాచారం. గత కొంత కాలంగా యెమెన్ లో రాజకీయ సంక్షోభం నెలకొంది. సున్నీలు, షియాల మధ్య ఆధిప్యత పోరాటం, అంతర్యుద్ధానికి దారితీసి, అధ్యక్షుడ్ని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. దీనిపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది.

  • Loading...

More Telugu News