: ఫేస్ బుక్ కారణంగా మోసపోయిన మహిళ
ఫేస్ బుక్ యువతుల పాలిట శాపంగా మారుతోంది. అభిరుచుల పేరిట పెంచుకుంటున్న స్నేహాలు కొంపముంచుతున్నాయి. తాజాగా ఢిల్లీలో ఓ దారుణం చోటుచేసుకుంది. రాజన్ మల్హోత్రా (22) అనే యువకుడు 19 ఏళ్ల యువతిని ఫేస్ బుక్ లో పరిచయం చేసుకున్నాడు. అభిరుచులు కలవడంతో 'ముఖపుస్తక' పరిచయం స్నేహంగా, ఆపై ప్రేమగా మారింది. దీంతో వారిద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇంతలో రాజన్ ఆ యువతిని గుర్గావ్లోని ఓ హోటల్ కు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం రాజన్ ఫేస్ బుక్ అకౌంట్ తొలగించి, ఫోన్ నెంబర్ మార్చేశాడు. దీంతో ఆమె మోసపోయినట్టు గ్రహించి, పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.