: ఒబామా సేవకు 50 మంది, రిజర్వులో 20 మంది


మూడు రోజుల భారత పర్యటనకు రానున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు ఘనమైన ఆతిథ్యం ఇచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 25న ఒబామా రానుండడంతో ఢిల్లీ ఐటీసీ మౌర్య హోటల్ లో ఏర్పాట్లు ఊపందుకున్నాయి. మూడు రోజులపాటు ఒబామా దంపతులు ఇదే హోటల్ లో బసచేయనున్నారు. అమెరికా ప్రథమ దంపతులకు సేవలు అందించేందుకు ఐటీసీ మౌర్య 50 మంది సిబ్బందిని సిద్ధం చేసింది. అవసరమైన పక్షంలో మరిన్ని సేవల కోసం మరో 20 మంది అదనపు సిబ్బందిని సిద్ధంగా ఉంచింది. వీరంతా ఒబామా దంపతులకు భోజనం సహా అన్ని ఏర్పాట్లు చేయనున్నారు. అయితే, సిబ్బంది వివరాలను మాత్రం గోప్యంగా ఉంచారు. 2010లో ఒబామా వచ్చినప్పుడు కూడా ఇదే హోటల్ లో బసచేయడం విశేషం.

  • Loading...

More Telugu News