: కిరణ్ బేడీ అస్తుల విలువ రూ.11.65 కోట్లు
తనకు 11.65 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని ఢిల్లీ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీ అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఢిల్లీలోని కృష్ణానగర్ అసెంబ్లీ స్థానంలో పోటీ చేసేందుకు ఈసీకి నామినేషన్ పత్రాలతో కూడిన అఫిడవిట్ దాఖలు చేసిన ఆమె, తన ఆస్తులను ప్రకటించారు. తన పేరిట, తన భర్త పేరిట ఉన్న స్థిర, చరాస్తులను అఫిడవిట్లో పేర్కొన్నారు. తనపై ఏ కోర్టులోనూ ఎటువంటి కేసులు లేవని స్పష్టం చేశారు. కాగా, నేటితో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల గడువు ముగిసింది. రేపటి నుంచి రెండు రోజుల పాటు నామినేషన్ల ఉపసంహరణ గడువు అమలు కానుంది.