: డిజైనర్ గా మారిన షారూఖ్ భార్య
కొప్పున్నమ్మ ఏ ముడి వేసినా అందమే అన్నట్టు, సినీ జనాలు ఏ రంగంలో అడుగుపెట్టినా చర్చనీయాంశమే. తాజాగా బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ భార్య గౌరి ఫ్యాషన్ డిజైనర్ అవతారమెత్తింది. ఇంటీరియర్ డిజైనర్ గా తన ఇంటిని తీర్చిదిద్దుకున్న గౌరీఖాన్, ఫ్యాషన్ రంగంలో తనదైన ముద్రవేయాలనే మక్కువతో ఆ రంగంలోకి అడుగుపెట్టింది. ప్రఖ్యాత సత్యపాల్ డిజైనర్ బ్రాండ్ 30వ వార్షికోత్సవం సందర్భంగా ఆమె డిజైన్ చేసిన కొన్ని దుస్తులను ప్రదర్శిస్తూ ట్వీట్ చేసింది. భారీ అభిమానగణం ఉన్న షారూఖ్ భార్యగా తాను డిజైన్ చేసిన దుస్తులకు ఆదరణ లభిస్తుందని, డిజైనర్ దుస్తులకు గిరాకీ కూడా పెరుగుతుందనేది గౌరీ కొత్త ఆలోచనగా ఉంది.