: గుడివాడలో తెలుగు తమ్ముళ్ల బాహాబాహీ


కృష్ణా జిల్లా గుడివాడలో టీడీపీ నేతలు బాహాబాహీకి దిగారు. పార్టీ కార్యాలయంలోని కుర్చీలనే ఆయుధాలుగా చేసుకుని ఒకరిపై ఒకరు దాడికి దిగారు. మార్కెట్ యార్డ్ ఛైర్ పర్సన్ పదవి నేపథ్యంలో రెండు వర్గాలుగా విడిపోయిన తెలుగు తమ్ముళ్లు ఘర్షణకు దిగారు. టీడీపీకి చెందిన కార్యకర్తలు రావి వెంకటేశ్వరరావు, పెదబాబు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు అసభ్యపదజాలంతో దూషణకు దిగి, తోసుకున్నారు. అనంతరం, పరస్పరం పిడిగుద్దులు కురిపించుకున్నారు. సుమారు అరగంటపాటు ఈ యుద్ధకాండ సాగింది.

  • Loading...

More Telugu News