: ట్విట్టర్లో షారుఖ్ ప్రభంజనం


బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ట్విట్టర్లో దూసుకెళుతున్నాడు. ఈ మైక్రో బ్లాగింగ్ సైట్లో ఇప్పుడాయన ఫాలోవర్ల సంఖ్య 11 మిలియన్ల మార్కు దాటింది. మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తర్వాత ఈ ఫీట్ సాధించిన రెండో భారతీయుడు షారుఖ్ ఖానే. అమితాబ్ ఫాలోవర్ల సంఖ్య 12.8 మిలియన్లు. 2010 జనవరిలో షారుఖ్ ట్విట్టర్ ఖాతా తెరిచాడు. ఇక, షారుఖ్ తర్వాతి స్థానాల్లో 'మిస్టర్ పర్ఫెక్షనిస్టు' అమీర్ ఖాన్ (10.8 మిలియన్లు), కండలరాయుడు సల్మాన్ ఖాన్ (10.2 మిలియన్లు), దీపికా పదుకొనే (9.13 మిలియన్లు), ప్రియాంక చోప్రా (8 మిలియన్లు) ఉన్నారు.

  • Loading...

More Telugu News