: రాజన్నకు మరణం లేదంటున్న షర్మిల
వైఎస్సార్సీపీ నేత షర్మిల నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్నారు. పరామర్శ యాత్ర ప్రారంభించిన సందర్భంగా దేవరకొండ రోడ్ షోలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రాజన్నకు మరణం లేదని, తెలుగుజాతి ఉన్నంత వరకు ఆయన సజీవంగానే ఉంటారని అన్నారు. ఆయన మరణంతో వందల సంఖ్యలో గుండెలు ఆగిపోయాయని చెప్పారు. వైఎస్సార్ ప్రజలకు సుపరిపాలన అందించారని తెలిపారు. ఆయన హయాంలో ధరలు పెరగలేదని, పేదవారికి కార్పొరేట్ వైద్యం అందించేందుకు ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చారని షర్మిల వివరించారు. రైతులకు గిట్టుబాటు ధర, ఉచిత విద్యుత్ తదితర పథకాలను వైఎస్సార్ ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. పేద విద్యార్థుల కోసం ఫీజు రీయింబర్స్ మెంట్ అమలు చేశారని చెప్పారు.