: నంది పురస్కారాల ప్రదానోత్సవ తేదీలు ఖరారు
నంది సినీ, టీవీ, రంగస్థల పురస్కారాల ప్రదానోత్సవ తేదీలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఉగాది రోజున నంది సినీ అవార్డులు ప్రదానం చేయనుంది. అక్టోబర్ 15న అనంతపూర్ లో నంది టీవీ పురస్కారాలను ఇవ్వనుంది. మే 28న ఎన్టీఆర్ జయంతి నాడు రాజమండ్రిలో నంది రంగస్థల పురస్కారాలు ఇవ్వనున్నట్టు తెలిపింది. 2012, 2013 సంవత్సరాలకుగానూ రాష్ట్ర విభజన తరువాత ఏపీ ప్రభుత్వం ఈ పురస్కారాలు ప్రదానం చేయబోతోంది. ఇక, త్వరలో ఈ పురస్కారాలకు సంబంధించి కమిటీ ఏర్పాటు చేసి నామినేషన్లను పిలవనుంది.