: 'అబ్ తక్' పత్రికపై రవీంద్ర జడేజా పరువునష్టం దావా


టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా 'అబ్ తక్' అనే సాయంకాల పత్రికపై పరువునష్టం దావా వేశాడు. భూ కబ్జాదారుడు బాలి దంగర్ తో జడేజాకు లింకులున్నాయంటూ రాజ్ కోట్ కు చెందిన ఈ సాయంకాల పత్రిక గతేడాది నవంబర్ 20న ఓ కథనం ప్రచురించింది. జడేజాకు, అతని వ్యాపార భాగస్వామి జెనెసీ అజ్మీరాలకు దంగర్ తో లావాదేవీలున్నాయంటూ ఆ పత్రిక పేర్కొంది. ఈ నేపథ్యంలో, జడేజా తన న్యాయవాది ద్వారా సదరు పత్రికకు ఎన్నో లీగల్ నోటీసులు పంపినా స్పందన కనిపించలేదు. అందుకనే రూ.51 కోట్లకు పరువునష్టం దావా వేసినట్టు జడేజా న్యాయవాది హిరేన్ బట్ తెలిపారు. ఆధారాల్లేని కథనం ద్వారా తన క్లయింటు ప్రతిష్ఠకు భంగం కలిగించారని ఆయన పేర్కొన్నారు. జడేజా తన జీవితంలో ఎన్నడూ దంగర్ ను కలవలేదని స్పష్టం చేశారు. సదరు పత్రిక అజ్మీరాను జడేజా రెస్టారెంట్ వ్యాపారంలో భాగస్వామి అని పేర్కొందని, అది తప్పని అన్నారు. అసలు అజ్మీరాతో జడేజాకు ఏ వ్యాపారంలోనూ భాగస్వామ్యం లేదని తెలిపారు. టీమిండియా వన్డే జట్టులో ప్రముఖ ఆటగాడిగా ఎదిగిన రవీంద్ర జడేజా రాజ్ కోట్ నగరంలోని కలావాడ్ రోడ్డులో 'జడ్డూస్ ఫుడ్ ఫీల్డ్' పేరిట రెస్టారెంట్ నడుపుతున్నాడు.

  • Loading...

More Telugu News