: నేను ఒక పార్టీకో, వ్యక్తికో వ్యతిరేకంగా పోటీ చేయడం లేదు: కేజ్రీవాల్


ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోరులో ఒక పార్టీకి లేదా ఒక వ్యక్తికి వ్యతిరేకంగా పోటీ చేయడం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నానని చెప్పారు. పెరుగుతున్న ధరలకు వ్యతిరేకంగా పోరాడుతున్నానని ఆయన తెలిపారు. గత ఎన్నికల్లో ఆప్ కు పరిమిత స్థానాలు కట్టబెట్టిన ఢిల్లీ ప్రజలు, ఈసారి పూర్తి మెజారిటీ అందించాలని ఆయన కోరారు. కాగా, బీజేపీ సీఎం అభ్యర్థిగా కిరణ్ బేడీని ప్రకటించడంతో, ఆ రెండు పార్టీల ప్రచారంతో వణికించే చలిలో ఢిల్లీ రాజకీయాలు వేడిపుట్టిస్తున్నాయి.

  • Loading...

More Telugu News