: స్వైన్‌ ఫ్లూ తగ్గేదాకా పాఠశాలలకు సెలవులు... కేసీఆర్ కు అధికారుల సలహా!


స్వైన్‌ ఫ్లూ మహమ్మారి ఒకరి నుంచి ఒకరికి వేగంగా విస్తరిస్తున్నందున చలి తీవ్రత తగ్గే వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తే మంచిదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అధికారులు సూచించినట్లు తెలిసింది. స్వైన్‌ ఫ్లూ నివారణపై ఈ మధ్యాహ్నం అధికారులతో కేసీఆర్‌ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో అధికారులు పలు సూచనలు చేశారు. చలి తీవ్రత ఎక్కువగా ఉండడం వల్లే వ్యాధి త్వరితగతిన వ్యాపిస్తోందని, ఉదయాన్నే చలిలో పిల్లలు పాఠశాలలకు వెళ్తుండగా, చలి ప్రభావంతో వారికి త్వరగా వ్యాధి సోకే ప్రమాదముందని వారు తెలిపారు. స్కూల్ చిన్నారుల్లో ఒక్కరికి సోకినా వందల మందికి స్వైన్ ఫ్లూ వైరస్ అంటుతుందని అందువల్ల సెలవులు ఇస్తే మంచిదని వారు తెలిపారు. దీనిపై కేసీఆర్ నేడో రేపో నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News