: భారత్ ను ఓడించి చరిత్ర సృష్టిస్తాం: పాక్ కెప్టెన్ మిస్బావుల్ హక్
వరల్డ్ కప్ క్రికెట్ పోటీలలో ఇప్పటివరకూ ఇండియాపై పాకిస్తాన్ ఒక్కటంటే ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయకపోవడాన్ని ప్రస్తావిస్తూ, 'చిరకాల ప్రత్యర్థి భారత్‌ను ఓడించి చరిత్ర మారుస్తాం' అని పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ మిస్బావుల్ హక్ అన్నాడు. ప్రపంచకప్ టోర్నీలో పాల్గొనేందుకు ఆస్ట్రేలియా బయలుదేరే ముందు మిస్బా విలేకరులతో మాట్లాడాడు. ఫిబ్రవరి 15న తాము తొలి మ్యాచ్ ను ఇండియాతో ఆడనున్నామని, ఆ మ్యాచ్ ఎంత ముఖ్యమైందో తమకు తెలుసునని వివరించాడు. తొలి మ్యాచ్ లో భారత్ ను ఓడించాలన్నదే ప్రథమ లక్ష్యమని తెలిపారు.