: ఐఎస్ ఏజెంట్ సల్మాన్ కు 10 రోజుల కస్టడీ
ఐఎస్ఐఎస్ లో చేరేందుకు విమానమెక్కబోతూ పోలీసులకు పట్టుబడ్డ సల్మాన్ మొహియుద్దీన్ ను 10 రోజుల పోలీసు కస్టడీకి అప్పగించనున్నారు. సల్మాన్ కస్టడీని కోరుతూ శంషాబాద్ పోలీసులు పెట్టిన దరఖాస్తును పరిగణనలోకి తీసుకున్న రాజేంద్రనగర్ న్యాయస్థానం పది రోజుల పోలీస్ కస్టడీకి అంగీకరించింది. దీంతో పోలీసులు సల్మాన్ నుంచి మరింత సమాచారం రాబట్టే అవకాశం ఉంది. ఇరాక్, సిరియా దేశాల్లో వేళ్లూనుకున్న ఐఎస్ఐఎస్ విదేశాల్లో మతోన్మాదులకు గాలం వేస్తూ, విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇందుకోసం యువతులను గాలం వేస్తూ పథకం ప్రకారం వారిని అనుచరులుగా చేసుకునేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో వారి ప్రణాళికలపై మరింత సమచారం తెలుసుకునేందుకు శంషాబాద్ పోలీసులు సల్మాన్ కస్టడీని కోరినట్టు సమాచారం.