: ఆస్ట్రేలియన్ ఓపెన్ లో సానియా శుభారంభం
ఇండియన్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు ఆస్ట్రేలియన్ ఓపెన్ లో శుభారంభం లభించింది. బుధవారం జరిగిన మహిళల డబుల్స్ లో సానియా - సీ సు వీయ్ (తైవాన్) జోడీ 6-2, 6-0తో మరియా ఇరిగోయెన్ (అర్జెంటీనా)- రొమినా ఒప్రాండి (స్విట్జర్లాండ్) జంటపై వరుస సెట్లలో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో సానియా జోడీ ప్రత్యర్థులపై పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ఈ మ్యాచ్ కేవలం 30 నిమిషాల్లోనే ముగియడం విశేషం.