: చంద్రబాబుకు స్విస్ బ్యాంకు ఖాతాలున్నాయి: చెవిరెడ్డి
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. బాబుకు స్విస్ బ్యాంకు ఖాతాలున్నాయని ఆయన ఆరోపించారు. ఆ ఖాతాల్లో చంద్రబాబు డబ్బులు దాచుకున్నారని అన్నారు. దావోస్ పర్యటనలో ఉన్న చంద్రబాబు అక్కడ నుంచి స్విట్జర్లాండ్ కు వెళుతున్నారని... ప్రస్తుతం స్విస్ వెళ్లాల్సిన అవసరం ఆయనకు ఏమిటని ప్రశ్నించారు. స్విస్ బ్యాంకుల్లో ఖాతాలు ఉండబట్టే, వాటిని చూసుకోవడానికి ఆయన స్విట్జర్లాండ్ వెళుతున్నారన్న అనుమానం కలుగుతోందని తెలిపారు.