: దావోస్ నుంచి టీటీడీపీ నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
దావోస్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు... అక్కడ నుంచే తెలంగాణ టీడీపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాదులో విజృంభిస్తున్న స్వైన్ ఫ్లూ మహమ్మారిపై ప్రజలను అప్రమత్తం చేయాలని, అరికట్టేందుకు తమవంతు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఆదుకునేందుకు టీడీపీ ఉంటుందన్న నమ్మకాన్ని ప్రజల్లో కలిగించాలని సూచించారు. ఇక తెలంగాణలో తన పర్యటనను అడ్డుకుంటామన్న టీఆర్ఎస్ నేతల ప్రకటనపై పార్టీ నేతలతో బాబు చర్చించారు. ఆ వెంటనే చంద్రబాబు విప్రో ఛైర్మన్ అజీం ప్రేమ్ జీతో భేటీ అయ్యారు.