: ఒబామాతో కలిసి మోదీ ‘మన్ కీ బాత్’ రేడియో ప్రసంగం


అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో కలిసి వాషింగ్టన్ పోస్ట్ లో ఎడిట్ కాలమ్ రాశారు. ఇదే సంప్రదాయాన్ని కొనసాగించే క్రమంలో ఆయన మరో అడుగు ముందుకేశారు. భారత పర్యటనకు వస్తున్న ఒబామాతో కలిసి తన రేడియో ప్రోగ్రాం ‘మన్ కీ బాత్’ ను నిర్వహించనున్నారు. ఈ మేరకు మోదీ ప్రతిపాదనకు ఒబామా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఈ నెల 27న వీరిద్దరూ సంయుక్తంగా రేడియో ప్రసంగం చేయనున్నారు. ఈ నెల 25న భారత్ కు రానున్న ఒబామా, 26న భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరవుతారు. 27న ప్రధాని మోదీతో కలిసి ఒబామా రేడియోలో ప్రసంగించనున్నారు.

  • Loading...

More Telugu News