: పార్లమెంటు బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ఖరారు


ఈ ఏడాది పార్లమెంటు బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 20 వరకు బడ్జెట్ సమావేశాలను జరపాలని పార్లమెంటు వ్యవహారాల కమిటీ నిర్ణయించింది. ఫిబ్రవరి 26న రైల్వే బడ్జెట్, 27 ఆర్థిక సర్వే, ఫిబ్రవరి 28న సాధారణ బడ్జెట్ లను పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. మిగతా రోజుల్లో బడ్జెట్ లపై చర్చ జరుగుతుంది. ఈ రోజు సమావేశమైన పార్లమెంటు వ్యవహారాల కమిటీ సమావేశాల షెడ్యూల్ ను ఖరారు చేసింది. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రధానమంత్రి నరేంద్రమోదీ కేబినెట్ ప్రవేశపెడుతున్న రెండవ బడ్జెట్ ఇది. ప్రస్తుత ఆర్థిక పరిస్ధితి అభివృద్ధి దిశగా సంకేతాలు చూపుతోంది. ఈ నేపథ్యంలో వృద్ధి ఆధారిత, పారిశ్రామిక పునరుద్ధరణ, ఉద్యోగాల కల్పన, వ్యవసాయ రంగానికి ఊతమిచ్చే దిశగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ పెడతారని ఆశిస్తున్నారు.

  • Loading...

More Telugu News