: మూడు రోజుల్లో పోతుందిలే అనుకున్నా... పోలే: కేసీఆర్


రాష్ట్రాన్ని స్వైన్ ఫ్లూ భూతం గట్టిగా పట్టుకుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. స్వైన్ ఫ్లూ రెండు మూడు రోజులే ఉండి, పోతుందిలే అని తొలుత అనుకున్నానని, కానీ పరిస్థితి వేరుగా ఉందని నేడు ఆయన వ్యాఖ్యానించారు. ఈ రోజు సాయంత్రం 3 గం.లకు కార్పొరేట్ ఆసుపత్రుల ప్రతినిధులతో, సాయంత్రం 5.00 గంలకు సహచర మంత్రులతో మాట్లాడి స్వైన్ ఫ్లూ మరింత విస్తరించకుండా చూసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తామని వివరించారు. ఎంత ఖర్చయినా ఈ మహమ్మారికి అడ్డుకట్ట వేసే విషయంలో వెనక్కు తగ్గబోమని తెలిపారు.

  • Loading...

More Telugu News