: ప్రభుత్వ లాంఛనాలతో ముగిసిన పాలడుగు అంత్యక్రియలు
కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ పాలడుగు వెంకట్రావు అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి. నూజివీడులోని కృష్ణారెడ్డి కాలనీకి సమీపంలో ఉన్న ఆయన వ్యవసాయ భూమిలో అంత్యక్రియలు జరిగాయి. అంతకుముందు ఆయన భౌతికకాయాన్ని పోలీసు కవాతు నడుమ ఊరేగింపుగా తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్, ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి పలువురు నేతలు పాల్గొన్నారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పాలడుగు హైదరాబాదులోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మొన్న మరణించిన సంగతి తెలిసిందే.