: తుళ్లూరులో పోలీసు సబ్ డివిజన్ కార్యాలయం: ఏపీ హోం మంత్రి చినరాజప్ప


నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం కానున్న తుళ్లూరులో పోలీసు సబ్ డివిజన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఏపీ డిప్యూటీ సీఎం, హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రకటించారు. కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన ఆయన ఈ మేరకు ప్రకటించారు. రాజధాని నిర్మాణానికి తుళ్లూరును ఎంపిక చేస్తూ ఏపీ ప్రభుత్వం ప్రకటించిన దరిమిలా అక్కడ భూ క్రయవిక్రయాలు పెరిగాయి. ఈ క్రమంలో, నేరాలు కూడా క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో తుళ్లూరు కేంద్రంలో డీఎస్పీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర విభజన తర్వాత విజయవాడతో పాటు రాయలసీమలోనూ రెండు పోలీసు బెటాలియన్లను ఏర్పాటు చేసేందుకు అనుమతి లభించిందని చినరాజప్ప పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News