: రామ భక్త ప్రభుత్వమిది: గడ్కరీ సంచలన వ్యాఖ్య


మరోసారి రాజకీయ దుమారం రేగేలా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం 'రామ భక్త' ప్రభుత్వమని ఆయన అన్నారు. ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో ఆయన మాట్లాడుతూ, "అయోధ్య నుంచి చిత్రకూట పర్వతం వరకూ, 'జై శ్రీరామ్' అని స్మరించే రామ భక్తులదే ఈ ప్రభుత్వం అని ఆయన తెలిపారు. గతంలో హిందువుగా ఉండి ముస్లిం పాలకుల ఒత్తిడి కారణంగా ఆ మతాన్ని తీసుకున్న వారిని తిరిగి హిందువులుగా మార్చేందుకు మాత్రమే 'ఘర్ వాపసీ' ప్రారంభించినట్టు ఆయన స్పష్టం చేశారు. గడ్కరీ వ్యాఖ్యలను కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. ఆయన మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించింది.

  • Loading...

More Telugu News