: చిట్టీల పేరిట జనానికి కానిస్టేబుల్ కుచ్చుటోపీ... కోటిన్నరతో పరారీ


చిట్టీల పేరిట ఘరానా మోసాలు తెలుగు రాష్ట్రాల్లో విచ్చలవిడిగా సాగుతున్నాయి. హైదరాబాద్ లో చిట్టీలు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్ జనం నెత్తిన కుచ్చుటోపీ పెట్టి పరారయ్యాడు. జనం నుంచి వసూలు చేసిన రూ.1.5 కోట్లతో అతడు కుటుంబంతో పాటు పరారయ్యాడు. గచ్చిబౌలిలో కొద్దిసేపటి క్రితం ఈ ఘటన వెలుగు చూసింది. చిట్టీల డబ్బుతో కానిస్టేబుల్ పరారైన విషయాన్ని గుర్తించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.

  • Loading...

More Telugu News