: పల్లెవెలుగు బస్సు బ్రేకులు ఫెయిల్... పలువురికి గాయాలు
సరైన కండిషన్లో లేని 'పల్లె వెలుగు' బస్సులు ప్రజల ప్రాణాలకు ముప్పు తెస్తున్నాయి. ఇటీవల అనంతపురం, కరీంనగర్ జిల్లాల్లో జరిగిన బస్సు ప్రమాదాలు మరువక ముందే మరో ఘటన చోటుచేసుకుంది. ఒక బస్సు బ్రేకులు ఫెయిల్ కాగా సుమారు 15 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన మెదక్ జిల్లా అంధోలు మండలం కిచ్చెన్నపల్లి సమీపంలో జరిగింది. రహదారిపై వెళ్తున్న బస్సు బ్రేకులు పడక అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టింది. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు స్పందించి క్షతగాత్రులను సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరి పరిస్థితి నిలకడగా వున్నట్టు అధికారులు వివరించారు.