: ఈ రోజు 'కౌగిలింతల రోజు'
నేడు 'కౌగిలింతల దినోత్సవం'. చిల్డ్రన్స్ డే, మదర్స్ డే, ఫాదర్స్ డే, లవర్స్ డే లాంటివి తెలుసు కాని... ఇలాంటిది కూడా ఒకటుందా, అని ఆలోచిస్తున్నారా?. 1986 జనవరి 21న కెవిన్ జాబొర్నీ అనే వ్యక్తి అమెరికాలో 'హగ్గింగ్ డే'ని పరిచయం చేశాడు. మరో విషయం ఏమిటంటే, ఈ రోజు అక్కడ పబ్లిక్ హాలిడే కూడా. కౌగిలింత ఒక చక్కటి అనుభూతి అనేది శాస్త్రవేత్తల అభిప్రాయం కూడా. అమితంగా అభిమానించే వారిని, ప్రేమించే వారిని కౌగిలించుకుంటే... మానసిక ఒత్తిడి తగ్గిపోతుందని ఇటీవలే ఓ రీసర్చ్ రిపోర్ట్ తెలిపింది. మరో విషయం ఏమిటంటే, ఆత్మహత్యకు పాల్పడేవారు చివరి క్షణంలో తాము ప్రేమించే వ్యక్తులను కౌగిలించుకోవాలనుకుంటారట.